
హెచ్1బితో పాటు పలు వీసాలపై ఈ జూన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. వీటిపై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని దాటి ప్రవర్తించారని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ అభిప్రాయపడ్డారు.
వాణిజ్య శాఖ, హోంలాండ్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫాక్చర్స్, యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ అండ్ టెక్‌నెట్ నేతృత్వంలోని కొన్ని కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ వీసాలపై నిషేధాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు తక్షణమే అమల్లోకి రానుంది.
అమెరికాలోని పలు సంస్థల్లో విదేశాలకు చెందిన నిపుణులకు నియమించుకునే అవకాశం కలిగించే హెచ్1బి, వ్యవసాయేతర కార్మికుల కోసం హెచ్2బి, కళాకారులకు సంబంధించి జె, మేనేజర్ల కోసం ఇవ్వబడే ఎల్ తరహా వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ ట్రంప్ జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. అయితే తమ పౌరులకు ఉద్యోగాలనిచ్చే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
హెచ్-1బీ, హెచ్-2బీ, ఇతర విదేశీ వీసాలైన జే, ఎల్ వీసాలపై ఈ ఏడాది చివరి వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ జూన్ నెలలో ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడంతో వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఐటీ కంపెనీలు, అమెరికా సంస్థలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తాయి.
More Stories
క్రిమియాను రష్యాకు వదులుకునేందుకు ఉక్రెయిన్ విముఖం
విద్యార్థుల వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు