ఆరు నెలల్లో ఏపీ ఖజానా లోటు రూ.58,708 కోట్లు 

ఆరు నెలల్లో ఏపీ ఖజానా లోటు రూ.58,708 కోట్లు 
ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక వ్యవహారాలు అదుపు తపుప్తున్నాయా? ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఖజానా లోటు రూ 58,708 కోట్లకు చేరుకున్నట్లు స్వయంగా రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వెల్లడించడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్ధ భాగం గడిచిపోగా ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం మాత్రం పెరిగిపోతూనే ఉంది. తాజాగా రిజర్వ్‌బ్యారకు వెల్లదించిన గణాంకాల మేరకు ఏప్రిల్‌ నుంచే లోటు ప్రారంభం కాగా, తొలి రెండు మాసాలు పది వేల కోట్ల రూపాయల చొప్పున లోటు కనిపించింది. 
 
తరువాత నెలల్లో కొద్దిగా నెమ్మదించి తొమ్మిది వేల కోట్లకన్నా తక్కువగానే లోటు నమోడైంది. అయితే సెప్టెంబర్  నెల్లో లోటు మళ్లీ పదివేల కోట్లకు చేరువ కావడం గమానార్హం. మొత్తం మీద చూస్తే ఆరు నెలల్లో రూ.23,736 కోట్లు మాత్రమే ఆదాయం లభించగా, ఖర్చు మాత్రం రూ.81,763 కోట్లకు చేరుకుంది. 
 
దీరతో ఖజానా లోటు రూ.58,708 కోట్లకు చేరిపోయింది. కరోనా కారణంగానే పన్నుల వసూళ్లపై ప్రభావం పడుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు. చివరకు ప్రతి నెలా జీతాలు చెల్లించే పరిస్థితి కూడా ఉండడంలేదని, అప్పు చేస్తేనే జీతాలు, పింఛన్ల గండం నుంచి గట్టెక్కే పరిస్థితి ఉన్నదని వారంటున్నారు. 
 
ఇక కేంద్రం నురచి రావాల్సి నిధుల్లో కూడా బకాయిలు పెరిగిపోతుండటం, జిఎస్‌టి పరిహారం రాకపోవడం, పలు పథకాలకు ఇవ్వాల్సిన నిధులు నిలిచిపోవడం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.