2020-21 ఆర్థిక సంవత్సరంలో భాగంగా నేటి నుంచి మూడో త్రైమాసికం ప్రారంభంకానున్నది. ఈ క్రమంలో గురువారం నుంచి పలు రంగాల్లో కొన్ని కొత్త విధాన నిబంధనలు రానున్నాయి.
మోటారు వాహనాల నిబంధనలు: నేటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను (హార్డ్ కాపీలు) ట్రాఫిక్ పోలీసులకు చూపించాల్సిన అవసరంలేదు. వాటికి బదులుగా ‘డిజీలాకర్’, ‘ఎం-పరివాహన్’ యాప్‌లలో ఆయా పత్రాల సాఫ్ట్ కాపీలను ఫోన్లో చూపిస్తే సరిపోతుంది.
ఆహారం: విడిగా బాక్సుల్లో స్వీట్లను అమ్మే మిఠాయివాలాలు కూడా ఆయా తినుబండారాలపై ‘బెస్ట్ బిఫోర్ డేట్'(గడువు తేదీ)ను తెలియజేయాలి. మరోవైపు, ఆవ నూనెను ఇతర నూనెలతో కలిపి తయారుచేయడం నిషేధం.
ఆరోగ్య సేవలు: ఆరోగ్య సేవల రేట్లు 5 శాతం – 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నది. ఇన్సూరెన్స్ పథకాల్లో కరోనాను కూడా చేర్చబోతున్నారు.
ఎస్బీఐలో కనీస నిల్వ: మెట్రో నగరాల్లోని ఎస్బీఐ ఖాతాల్లో కనీస నిల్వ రూ. 5 వేల నుంచి రూ. 3 వేలకు తగ్గనున్నది. ఎల్పీజీ: ఉజ్వల యోజన పథకం కింద తీసుకునే గ్యాస్ సిలెండర్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వబడదు.
టీవీలు: దిగుమతి సుంకం పెరిగిన నేపథ్యంలో టీవీల రేట్లు పెరుగనున్నాయి.
డిజిటల్ చెల్లింపులు: లావాదేవీల భద్రత కోసం.. డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులు స్వచ్ఛందంగా పరిమితులు విధించుకోవచ్చు.
మొబైల్స్: డ్రైవింగ్ చేసేటప్పుడు నావిగేషన్ కోసం మొబైల్స్ వాడొచ్చు.
విదేశీ ప్రయాణాలు: విదేశీ టూర్లకు వెళ్లేవారు 5 శాతం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు