
భగత్‌సింగ్ భారతీయులందరికీ స్ఫూర్తి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సోమవారం భగత్ సింగ్ 113వ జయంత్రి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.
‘భగత్‌సింగ్ తన విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్తమార్గం చూపారు. దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసి యువతలో స్ఫూర్తి నింపిన గొప్ప వీరుడు. ఆయన స్ఫూర్తిని భారత జాతి నిరంతరం గుర్తు చేసుకుంటుందని’ అని ట్విట్టర్‌లో అమిత్ షా పేర్కొన్నారు.
1907లో ఫైసలాబాద్ జిల్లాలోని బంగా గ్రామం( ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోగల ల్యాల్‌పూర్)లో భగత్‌సింగ్ జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యోమంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమించి 23 ఏండ్ల వయస్సులోనే ఉరితీయబడ్డాడు. భగత్ సింగ్‌ను 1931 మార్చి 23న లాహోర్ జైలులో ఉరితీశారు.
More Stories
దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం
జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం