
ఉగ్రవాద కార్యకలాపాలకు కర్నాటక రాజధాని బెంగళూరు ప్రధాన కేంద్రంగా మారిందని బీజేపీ ఎంపీ, యువమోర్చ నూతన జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో బెంగళూరు, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో చాలా టెర్రర్ మాడ్యూల్స్‌ను ఛేదించారని తెలిపారు.
పలువురు స్పీపర్ టెర్రర్ సెల్స్‌తోపాటు మరి కొందరిని అరెస్టు చేశారని, ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని చెప్పారు. ఉగ్రవాద బృందాలు ఉగ్ర కార్యకలాపాల కోసం బెంగళూరును ఇంక్యుబేటర్ సెంటర్‌లా వాడుకోవాలని చూస్తున్నారని హెచ్చరించారు.
దక్షిణ భారత్ కు ఆర్ధిక కేంద్రంగా మారిన బెంగళూరు నగరాన్ని ఉగ్రవాదులు, దేశ విద్రోహ శక్తుల నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశానని, బెంగళూరులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను కోరానని తెలిపారు.
బెంగళూరు నగరంలో ఎన్ఐఏ విభాగం ఏర్పాటు వల్ల ఉగ్రవాదుల జాతీవ్యతిరేక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అడ్డుకునే అవకాశం ఉంటుందని హోంమంత్రికి వివరించినట్లు తేజస్వి సూర్య తెలిపారు. తన అభ్యర్థనను హోంమంత్రి అంగీకరించారని, త్వరలోనే బెంగళూరులో ఎన్ఐఏ విభాగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
గత ఆగస్టు 11న నగరంలోని పోలీస్ట్‌స్టేషన్‌లపై దాడులు జరిగాయని, అయితే ఆ దాడులు యాథృచ్చికంగా జరిగినవి కావని స్పష్టం చేశారు, పక్కా ప్లాన్‌తో జరిగాయనే విషయం ఎన్ఐఏ విచారణలో తేలిందని తేజస్వి గుర్తుచేశారు.
More Stories
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
నకిలీ వార్తలు సమాజానికి ప్రమాదకరం
ఔట్ సోర్సింగ్ నియామకాలతోనే పేపర్ లీకేజి!