మనీష్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమం

మనీష్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమం
భారత్ లో కరోనా వైరస్ కలవర పెడుతోంది. కరోనా వైరస్ ధాటికి రోజుకు వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్  సిసోడియాకు కరోనా వైరస్ సోకింది. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ నెల 14న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనాతో పాటు డెంగ్యూ కూడా ఎటాక్‌ చేయడంతో గడిచిన 24 గంటల్లో మరింత విషమంగా ఉందని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నాయక్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో పాటు శరీరంలో ఆక్సిజన్‌శాతం పడిపోయిందని పేర్కొన్నారు.
 
మనీష్ ఆరోగ్య పరిస్థితి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 3834 కేసులు నమోదుకాగా 36 మంది చనిపోయారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2.60 లక్షలకు చేరుకోగా 5123 మంది మృత్యువాతపడ్డారు.
 మరోవైపు దేశ రాజధానిలో పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ.. కోలుకునే వారి సంఖ్య పెరగడం కొంతమేర ఊరటనిస్తోంది. తాజా గణాంకాలతో ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షల 60 వేలు దాటింది.