మౌలిక అంశాలపై దృష్టి సారించిన దీనదయాళ్ 

* 104వ జయంతి నివాళి

ఒక సాధారణ కుటుంభంలో జన్మించి, కేవలం తన ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య పూర్తిచేసి, సివిల్ సర్వీస్ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంక్ పొంది కూడా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా సామజిక సేవకు అంకితమైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మౌలిక అంశాలపై దృష్టి సారించిన యోధుడు.  ప్రత్యామ్న్యాయ సామజిక, రాజకీయ, ఆర్ధిక విధానాలను దేశ ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. 
 
లక్నోలో కాంగ్రెస్ – ముస్లిం లీగ్ ల మధ్య మహాత్మ గాంధీ ఒక ఒప్పందం కుదుర్చుకున్న రోజుననే సెప్టెంబర్ 25, 1916న అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న ఉత్తరప్రదేశ్‌లోని మధుర దగ్గరలోని చంద్రభాన్ అనే గ్రామంలో జన్మించారు. 
 
ఎనిమిది ఏళ్ళ వయస్సుకే తల్లితండ్రులను కోల్పోయారు. మేనమామ పెంపకంలో పెరిగారు. అనేక  కష్టాలను ఎదుర్కొంటూ పాఠశాల పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఉపకారవేతనంతో బిఎ (ఇంగ్లీష్) పూర్తి చేశారు. సన్నిహిత బంధువు ఒకరు చనిపోవడంతో ఎంఏ పూర్తి చేయలేక పోయారు. 
 
సివిల్ సర్వీస్ పరీక్షలకు దోతీ, కుర్తా, టోపీ ధరించి వెళ్లడంతో `పండిట్’ అనే పేరు పొందారు. ఆ పరీక్షలలో మంచి ర్యాంక్ పొందినా ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు. ఐదేళ్ల క్రితం ఆర్ ఎస్ ఎస్ తో ఏర్పడిన పరిచయం కారణంగా 1942లో ప్రచారక్ గా జీవితం ప్రారంచించారు. 
 
కాన్పూర్ లో సుందర్ సింగ్ భండారి ఆయనతో కలసి చదువుకున్నారు. రాజస్థాన్ లో ఒక శాఖలో ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకులు డా. హెగ్డేవార్ తో మేధోపర సమాలోచనలు జరిపారు. లాఖిమ్పూర్ జిల్లా ప్రచారక్ గా వెళ్లారు. తర్వాత యుపి ప్రాంత సహా ప్రచారక్ పనిచేశారు. 
 
తర్వాత లక్నో లో రాష్ట్ర ధర్మ ప్రకాశన్ ప్రచురణ సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర ధర్మ అనే పత్రికను, పాంచజన్య వార పత్రికను, స్వదేశ్ దిన పత్రికలను నడిపారు. 
 
నెహ్రు – లియాక్కుత్ ఒప్పందంపై నిరసనగా 
శ్యామా ప్రసాద్ ముఖేర్జీ కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగి భారతీయ జన సంఘ్ ను 1951లో ప్రారంభించినప్పుడు ఆర్ ఎస్ ఎస్ అధినేత ఏం ఎస్ గోల్వాల్కర్ సహకారం కోరారు. ఆయన జనసంఘ్ కోసం ఇచ్చిన నలుగురు సీనియర్ ప్రచారక్ లలో ఉపాధ్యాయ ఒకరు. 
 
సంకీర్ణ రాజకీయాల వ్యూహకర్త 
 
మొదట జనసంఘ్ యుపి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1953లో ముఖర్జీ మరణం అనంతరం తర్వాత 15 ఏళ్లపాటు జనసంఘ్ కార్య నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 
 
జనసంఘ్ కు బలమైన సైద్ధాంతిక భూమిక ఏర్పాటు చేయడంతో పాటు సామజిక, రాజకీయ, ఆర్ధిక విధానాలు రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. 1967, 1968లలో పార్టీ అధ్యక్షుడిగా కొద్దికాలం పాటు  పనిచేశారు. 
 
బాలరాజ్ మధోక్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆయన వ్యూహాత్మక కార్యపద్ధతి కారణంగా  1967లో పార్టీ 35 లోక్ సభ సీట్లతో లోక్ సభలో మూడవ పెద్ద పార్టీగా గుర్తింపు పొందింది. 
 
యుపిలో సంయుక్త విధాయక దళ్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది. మరో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా జనసంఘ్ చేరింది. అప్పటి నుండే దేశంలో సంకీర్ణ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. 
 
డిసెంబర్, 1967లో కలకత్తాలో జరిగిన జనసంఘ్ జాతీయ మహాసభలలో పార్టీ అధ్యక్షత పదవి చేబడుతూ సంకీర్ణ రాజకీయాల ప్రాధాన్యతను వివరించారు. అయితే ఆ తర్వాత కొద్దీ నెలలకే మృతి చెందారు. 
 
కేంద్రంలో, పలు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు రూపొందించిన అంత్యోదయ పధకాలు అన్ని దీనదయాళ్ ప్రబోధించిన అట్టడుగున ఉన్నవారి సంక్షేమంకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే సైద్ధాంతిక మార్గదర్శనం ఆధారంగా రూపొందించినవే. 
 
ఏకాత్మ మానవతా ప్రబోధం 
 
మూడేళ్ళ క్రితం దీనదయాళ్ జన్మ శతదినోత్సవాలను ప్రారంభిస్తూ “సమానత్వం సాధించాలి అంటే ఉన్నత స్థానాలలో ఉన్నవారు కొంచెం కిందగి వంగి దోపిడీకి, నిర్లక్ష్యానికి గురవుతున్న వారికి కొంత చేయూత ఇవ్వాలని దీనదయాలజి చెబుతూ ఉదనేవారు” అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 
 
ప్రజల అందరి సంపూర్ణ వికాసాన్ని దీనదయాళ్ కోరుకున్నారని చెబుతూ ముస్లింలు, దళితులు, అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతిని  ప్రస్తావిస్తూ ఉండేవారని ప్రధాని తెలిపారు. “ముస్లింలను భిన్నమైన వారుగా చూడరాదు. వారి సాధికారికతకు కృషి చేయాలి. వారిని వోట్ బ్యాంకు గా చూడరాదు. సొంత మనుష్యులుగా చూడాలి” అని 50 ఏళ్ళ క్రితమే దీనదయాళ్ చెబుతుండేవారని ప్రధాని గుర్తు చేశారు. 
 
ఆయన అందించిన అత్యున్నత సైద్ధాంతిక భూమిక “ఏకాత్మత మానవతావాదం”.  మొత్తం ప్రపంచం అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానం, సామ్యవాదంలకు ప్రత్యామ్న్యాయంగా సమగ్రమైన సైద్ధాంతిక ఆలోచనల తాత్వికత. కులం, వర్గం, ఘర్షణలు లేని సామజిక వ్యవస్థను ఆయన ప్రతిపాదించారు. భారత సామజిక, రాజకీయ, ఆర్ధిక విధానాలు భారతీయ సంస్కృతిలో సమ్మిళతం కావాలని చెప్పారు. 
ఒక వ్యక్తిలోని శరీరం, మనసు, మేధస్సు, ఆత్మ కలసి శరీరంగా ఉన్నట్లే సమాజం కూడా ఉంటుందని తెలిపారు. ధర్మ ద్వారానే శాంతి, సమృద్ధి సాధ్యం కాగలదని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి సర్వాంగణ వికాసమే లక్ష్యంగా మన ఆర్థిక, సామాజిక, రాజకీయ విధివిధానాలు రూపొందినప్పుడు సర్వశ్రేష్ఠ భారత నిర్మాణం సాధ్యమని ఆయన చెబుతూ ఉండేవారు. 
 
అంతుబట్టని మరణం 
 
దీనదయాళ్ మరణం నేటికీ అంతుబట్టడం లేదు. ఫిబ్రవరి 11, 1968న ముఘలసరై రైల్వే స్టేషన్ లో సుమారు 150 అడుగుల దూరంలో ఆయన మృత దేహాన్ని ఒక కార్మికుడు కనుగొన్నారు. ఆ తర్వాత లక్నో నుండి పాట్నాకు రైలులో వెడుతున్న ఆయనదే ఈ మృతదేహం అని గుర్తించారు. 
 
లక్నోలో సాయంత్రం 7 గంటలకు పఠాన్ కోట్ – సీల్డాహ్ ఎక్సప్రెస్ రైలు ఎక్కారు. ఆ రోజులలో నేరుగా పాట్నాకు వేళ్ళని ఆ రైలు నుండి కొన్ని భోగిలను ముఘలాసరాయ్ స్టేషన్ లో విడదీసి ఢిల్లీ – హౌరా ఎక్సప్రెస్ కు జతచేసే  వారు. 
 
ఉదయం 2.50 గంటల ప్రాంతంలో జయునపుర్ మాజీ పాలకుడు ప్రతినిధి సందేశం తీసుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ స్టేషన్ లో దీనదయాళ్ కలిశారు. ఆ రైలు 2.50 గంటలకు బయలు దేరి ఉదయం పాట్నా అచేరుకున్నప్పుడు అందులో ఆయన లేరు. ఆయన మృతదేహాన్ని అక్కడి నుండి ఢిల్లీకి తీసుకు వచ్చినప్పుడు దేశ అధ్యక్షుడు జాకిర్ హుస్సేన్, ప్రధాని ఇందిరా గాంధీ వంటి అనేకమంది ప్రముఖులు నివాళులు అర్పించారు.