ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీసీ) కంటే ఐదు సంవత్సరాల ముందు 2025 నాటికి క్షయవ్యాధిని అంతం చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు.
ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు, సంస్థల ప్రతినిధులు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి హర్షవర్ధన్ మాట్లాడుతూ ‘క్షయ వ్యాధి ఎప్పటి నుంచో ఉనికిలో ఉందని, ప్రప౦చవ్యాప్తంగా ప్రజారోగ్య సమస్యగా ఉందని పేర్కొన్నారు. గత దశాబ్దంలో పురోగతి సాధించినప్పటికీ అంటువ్యాధిగా మిగిలిపోయింది’ తెలిపారు.
దాన్ని నిర్మూలించే దిశగా భారత్ చర్యలను ప్రశంసిస్తూ సంపూర్ణ వనరుల మద్దతుతో వినూత్నమైన విధానాలతో, టీబీని అంతం చేసే దిశగా భారత్ అనేక క్లిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. 2019లో మిలియన్ నుంచి 0.5 మిలియన్ల తగ్గించినట్లు తెలిపారు. ఈ ఏడాది 2.4 మిలియన్ కేసులు నోటిఫై చేసినట్లు తెలిపారు.
టీబీకి ప్రధాన కారణం పోషకాహార లోపమని, దాన్ని పరిష్కరించేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నగదు ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 2018 నుంచి, మూడు మిలియన్ల మంది లబ్ధిదారులకు రూ.7.9 బిలియన్లు (సుమారు 110 మిలియన్ అమెరికన్ డాలర్లు) పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే మహమ్మారి నివారణకు తీసుకుంటున్న చర్యలను సైతం వివరించారు.
More Stories
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
జార్ఖండ్లో ఎన్నార్సీని అమలు చేస్తాం