9 జిల్లా దవాఖాన్లలో వెంటిలేటర్లు లేవ్

A ventilator can help patients unable to breathe on their own, but the experience of COVID-19 patients has been sobering for doctors.

తెలంగాణలో కరోనా చికిత్స అందిస్తున్న 9 జిల్లా దవాఖాన్లలో ఒక్క వెంటిలేటర్‌‌‌‌ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ బులెటిన్‌‌లో ఇచ్చిన వివరాల ప్రకారం ప్రస్తుతం 62 సర్కార్ దవాఖాన్లలో కరోనా చికిత్స అందిస్తుండగా, 29 ఆస్పత్రుల్లో అసలు వెంటిలేటర్లే లేవు. మరో 10 హాస్పిటళ్లలో ఐదు లోపే ఉన్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 800 వెంటిలేటర్లే ఉన్నాయి. వీటిలో గాంధీలోనే 385 ఉండగా, ప్రస్తుతం అక్కడ 361 మంది వెంటిలేటర్‌‌‌‌పై చికిత్స పొందుతున్నారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌, పెద్దపల్లి, భూపాలపల్లి, భువనగిరి, ములుగు, నాగర్‌‌‌‌కర్నూల్‌‌, నారాయణపేట, నర్సంపేట (వరంగల్ రూరల్), నిర్మల్‌‌ జిల్లా ఆస్పత్రుల్లో ఒక్క వెంటిలేటర్ కూడా లేదు. 

చాలాచోట్ల కనీసం ఐసీయూ బెడ్లు కూడా లేవు. రాష్ట్రంలో కరోనాకు ముందు 192 వెంటిలేటర్లు ఉండేవి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 1,400 వెంటిలేటర్లు పంపించింది. రాష్ట్ర సర్కార్ కొన్ని బెడ్లు కొనుగోలు చేయగా, మరికొన్ని విరాళాల రూపంలో వచ్చాయి. కానీ వీటిని ఆయా దవాఖాన్లలో ఇన్‌‌స్టాల్ చేయడంలో మాత్రం సర్కార్ శ్రద్ధ చూపడం లేదన విమర్శలు ఉన్నాయి. 

జిల్లాల్లో ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు లేకపోవడంతో రోగులను హైదరాబాద్‌‌కు రిఫర్ చేస్తున్నారు. దీంతో నగరంలోని దవాఖాన్లలో డాక్టర్లు, నర్సులపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రోగుల కుటుంబసభ్యులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

కాగా, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు గైడ్‌‌‌‌‌లైన్స్‌‌ను మహబూబ్‌‌నగర్, నిర్మల్‌‌ జిల్లాల్లోని ఆస్పత్రుల్లో పనిచేసే సహాయ సిబ్బందికి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది.