జగన్ ఇంటిని ముట్టడించిన బజరంగ్‌దళ్

జగన్ ఇంటిని ముట్టడించిన బజరంగ్‌దళ్
 
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాని నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్  లోటస్ పాండ్‌లోని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటిని బజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టించారు.
 
ఈ క్రమంలో పోలీసులకు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
 వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. `కబడ్ధార్ హిందూ ద్రోషులారా’  అంటూ నినాదాలిచ్చారు.