ద‌ర్శ‌కుడు అనురాగ్ కాశ్య‌ప్ పై రేప్ కేసు

లైంగిక దాడి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప్ర‌ముఖ‌ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ కాశ్య‌ప్ పై రేప్ కేసు న‌మోదైంది. త‌న‌పై లైంగిక‌దాడి చేశారంటూ ద‌ర్శ‌కుడు అనురాగ్ కాశ్య‌ప్ పై న‌టి పాయ‌ల్ ఘోష్ ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్ లో కేసు నమోదు చేసిన‌ట్టు ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. 

మంగ‌ళ‌వారం రాత్రి న‌టి పాయ‌ల్ ఘోష్ త‌న లాయ‌ర్ నితిన్ సాత్పుటేతో క‌లిసి పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఐపీసీ సెక్ష‌న్ 376 (ఐ), 354, 341, 342 సెక్ష‌న్ల కింద అనురాగ్ కాశ్య‌ప్ పై కేసు న‌మోదైంది. ఈ కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతుంది. 

2013లో వెర్సోవాలోని యారి రోడ్ లో కాశ్య‌ప్ త‌న‌పై లైంగిక దాడి చేశాడ‌ని న‌టి పాయ‌ల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణలో భాగంగా అనురాగ్ కాశ్య‌ప్ ప్ర‌శ్నించనున్న‌ట్టు స‌ద‌రు అధికారి తెలిపారు. 

మొద‌ట పాయ‌ల్ త‌న లాయ‌ర్ తో క‌లిసి ఒషివారా పోలీస్ స్టేష‌న్ కు వెళ్ల‌గా..ఈ ఘ‌ట‌న వెర్సోవా పీఎస్ ప‌రిధిలో జ‌రిగిందు వ‌ల్ల అక్క‌డే ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు సూచించారు. వెర్సోవాలో ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్తుండ‌గా..అనురాగ్ కాశ్య‌ప్ ఆఫీస్ ఒషివారా ప‌రిధిలో ఉంది.