విద్యావిధానంపై విద్యాభారతి పోటీలు 

విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ, మైఎన్ఇపి (MyNEP) ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నూతన విద్యావిధానంపై వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహిస్తారు. 

మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ యూజీ, పీజీ విద్యార్థులకు, మూడోది సామాన్య ప్రజలకు నిర్వహిస్తున్నారు. 

మొత్తం తెలుగుతోపాటు పదమూడు భాషలలో నిర్వహించే ఈ పోటీలలో ప్రతి అంశంలో భాష వారిగా మొదటి బహుమతిగా రూ 10,000, రెండవ బహుమతిగా రూ 5,000 , మూడో బహుమతిగా రూ 3,000 తో పాటు రూ 1,000 చొప్పున 10  ప్రత్యేక బహుమతులు అందచేస్తారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ కూడా అందిస్తారు. 

 మొదటి కేటగిరీ : 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 2 నిమిషాల వకృత్వం, 300 పదాలతో వ్యాస రచన, ప్రధానమంత్రికి ఉత్తరం రాయడం, పోస్టర్ పెయింటింగ్మ,  మీమ్స్ మేకింగ్ వంటి ఐదు విషయాలలో పోటీలుఉంటాయి. పోటీదారులు వీటిలో ఏదో ఒక అంశాన్ని ఎంచుకోవచ్చు.

రెండవ కేటగిరీ : యూజీ, పీజీ విద్యార్థులకు షార్ట్ ఫిలిం మేకింగ్, హ్యాండ్ మేడ్ పోస్టర్, డిజిటల్ పోస్టర్, 8 ట్వీట్స్ థ్రెడ్, మీమ్స్ మేకింగ్ లలో పోటీలు వుంటాయి. వీటిలో ఏదో ఒక అంశాన్ని పోటీదారులు ఎంపిక చేసుకోవచ్చు.

మూడవ కేటగిరీ : యూజీ, పీజీ విద్యార్థులకు నిర్దేశించిన ఏదో ఒక అంశంలో ఇతరులెవరైనా కూడా పాల్గొనవచ్చు.

ఈ  అంశాలలో పాల్గొనేందుకు 4 విషయాలు (అంటే థీమ్స్) ఉంటాయి. వీటిలో ఏదో ఒక విషయం ఆధారంగా పోటీలో పాల్గొనవచ్చు. అవి: అంటే భారతీయ ఆధారిత విద్య, సమగ్ర విద్య

 జ్ఞానాత్మక సమాజం, అంటే గుణాత్మక విద్య. ఈ నాలుగు అంశాలలో ఒకదాన్ని ఎంచుకుని పోటీలో పాల్గొనవచ్చు.

పోటీలో పాల్గొనడానికి MyNEP.in అనే వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకునేందుకు ఆఖరి తేదీ సెప్టెంబర్  24,  పోటీలు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. విజేతల వివరాలను అక్టోబర్ 5న ప్రకటిస్తారు. ఈ పోటీల తాలూకూ ఈ- పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమచంద్రా రెడ్డి,  ఆవిష్కరించారు.