
ప్రముఖ కోలీవుడ్ నటుడు, డిఎండికె అధినేత విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఆయన చెన్నయ్ లోని మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
విజయ్ కాంత్ లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారని, దీంతో ఆయనకు పాజిటివ్ నిర్థారణ అయిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విజయ్ కాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
మరోవంక, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 40 రోజులుగా చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నాక ఇతర అనారోగ్య సమస్యలతో అస్వస్థతకు గురైనట్టు వైద్యులు వెల్లడించారు.
ఈ నెల 19 నుంచి బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఆగస్టు 5తేదీన బాల సుబ్రహ్మణ్యం కోవిడ్-19 లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కొంత మెరుగైన విషయం తెలిసిందే.
More Stories
పహల్గాం దాడికి ముందు 22 గంటలపాటు ఉగ్రవాదుల ట్రెక్కింగ్!
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఎ దర్యాప్తు
కైలాస మానససరోవర్ యాత్రకు వెబ్సైట్ ప్రారంభం