చంద్రుడిపైకి మళ్లీ వ్యోమగాములను పంపనున్నట్లు . దీనికి నాసా వెల్లడించింది. చంద్రుడిపైకి 2024లో వ్యోమగాములను పంపనున్నట్లు నాసా చెప్పింది. దీని కోసం 28 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నారు. దీంట్లో 16 బిలియన్ల డాలర్లను కేవలం చంద్రుడిపై దిగే మాడ్యూల్‌కు ఖర్చు చేయనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రాజెక్టుకు టాప్ ప్రియార్టీ ఇచ్చారు. కానీ దానికి ఉభయ సభల అనుమతి దక్కాల్సి ఉంది. ఆర్టెమిస్ మిషన్ ద్వారా మానవులను చంద్రుడి మీదకు పంపనున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు.
చంద్రుడిపై దక్షిణ ద్రువం వైపు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. మూన్ మిషన్ కోసం మూడు విభిన్న ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ఇద్దరు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపుతామని, దాంట్లో ఓ మహిళా వ్యోమగామి కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఓరియన్ వెసల్ ద్వారా ఆ వ్యోమగామి నింగిలోకి వెళ్లనున్నది.
మానవరహిత ఆర్టెమిస్ 1 వ్యోమనౌకను 2021లో ప్రయోగించనున్నారు. కొత్త తరహా ఎస్ఎల్ఎస్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహిస్తారు. దీని కోసం ఓరియన్ క్యాప్సూల్ వాడనున్నారు. 2023లో రెండవ ఆర్టెమిస్ రాకెట్‌ను ప్రయోగిస్తారు.
ఆ వ్యోమనౌకలో వ్యోమగాములు ఉన్నా.. అది మాత్రం చుంద్రుడిపై దిగదు. ఇక చివరగా ఆర్టెమిస్-3ను ప్రయోగిస్తారు. ఇది 1969లో వెళ్లిన అపోలో 11 తరహా ఉంటుంది. వ్యోమగాములు ఆ నౌకలో వెళ్తారు. సుమారు వారం రోజుల పాటు ఆర్టెమిస్-3 చంద్రుడిపై ఉండే అవకాశాలు ఉన్నాయి.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ జయకేతనం