
మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అవినీతిని వివరించారు.
తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చిస్తూ అన్ని ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతి చేస్తున్నాడని వివేక్ తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని సీఎం అప్పుల రాష్ట్రంగా మార్చి వెనక్కి నెట్టారని, రాష్ట్రం మొత్తం అప్పులపాలు చేశాడని వివరించారు.
కేసీఆర్ అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలని కోరగా అందుకు నడ్డా సానుకూలంగా స్పందించారని వివేక్ వెల్లడించారు. బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వంపైన కేసీఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నాడని కూడా ఆయన నడ్డా దృష్టికి తీసుకు వచ్చారు.
రాష్ట్రంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంగా అయిందని, బీజేపీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని వివరించినట్టు వివేక్ తెలిపారు. రాబోయే మునిసిపల్, హైదరాబాద్ మేయర్ ఎన్నికలపై జేపీ నడ్డాకి వివరించానని పేర్కొన్నారు.
More Stories
వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు
చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
రెండు న్యూస్ ఛానళ్లలో చర్చల పట్ల హైకోర్టు ఆగ్రహం