‘చాలామంది నా పుట్టిన రోజున నేను ఏమి కోరుకుంటాను. ఇప్పుడు నేను కోరుకునేది మాస్క్‌లు సరిగ్గా ధరించండి.. సామాజిక దూరాన్ని అనుసరించండి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత రాత్రి ట్వీట్ చేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా మహమ్మారికి దూరంగా ఉండేందుకు మాస్క్‌లు ధరించడం కొనసాగించాలని, సామాజిక దూరం నిబంధనలను పాటించాలని కోరారు. చాలా మంది తనకు పుట్టిన రోజు ఎలాంటి కానుక కావాలని అడిగారని ట్వీట్ లో పేర్కొన్నారు.
‘దో గజ్‌కీ దూరి’ గుర్తు పెట్టుకోండి. రద్దీ ప్రదేశాలను పరిహరించండి. మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి’ అని, మన గ్రహాన్ని ఆరోగ్యంగా తయారు చేద్దాం’ అంటూ పిలుపునిచ్చారు. గురువారం 70వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
‘భారతదేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తమ హృదయపూర్వకమైన ఆకాంక్షలను పంచుకున్నారు. నన్ను పలకరించిన ప్రతి వ్యక్తికి నేను కృతజ్ఞుడిని. ఈ అభినందనలు నా తోటి పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సేవ చేసేందుకు నాకు శక్తినిస్తాయి’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, గొప్ప నాయకుడు, విశ్వాస మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం బలమైందని, యావత్ మానవాళికి ఇది మంచిదని పేర్కొన్నారు. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు.
More Stories
వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ