టాటాకు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం

నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి టాటాతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టును రూ  861.90 కోట్లతో పూర్తి చేయనున్నట్లు టాటా పేర్కొంది. లార్సెన్ అండ్ టర్బో దాఖలు చేసిన రూ 865 కోట్ల కంటే తక్కువ మొత్తం దాఖలు చేసి టాటా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దక్కించుకుంది. 

నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ రోజు ఆర్థిక వేలం నిర్వహించింది. కాగా, పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తంగా రూ 940 కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత ప్రజా పర్యవేక్షన శాఖ పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న భవనం బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అయితే ఈ భవనానికి కొన్ని మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ యేడాది ప్రారంభంలోనే ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో భాగంగా సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న భవనంలో పెరిగే సంఖ్యకు సరిపడా స్థలం లేదని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది.