బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కృష్ణదాస్ కి కరోనా సోకింది. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాడు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను పార్టీ సంస్థాగత విషయాలను చర్చించేందుకు బండి సంజయ్ సోమవారం కృష్ణదాస్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత కృష్ణదాస్ కు కరోనా సోకినట్టుగా తేలింది.
ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజుల పాటు స్వీయ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.
దీంతో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లకు సమాచారం అందించారు.
More Stories
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్యం తోఫా’
నల్గొండ బిఆర్ఎస్ కార్యాలయం కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం
జానీ మాస్టర్ పై పోక్సో కేసు