పాక్ సరిహద్దుల్లో ఆయుధాలు స్వాధీనం 

భారత్ – పాక్ సరిహద్దుల్లో సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌‌ఎఫ్) జవాన్లు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు ఎమ్-16 రైఫిల్స్ ఉన్నాయి.
 
 పంజాబ్ రాష్ట్రం, ఫిరోజ్‌‌‌పూర్ జిల్లాలోని జోగిందర్ చౌక్‌‌కు సమీపంలో వెపన్స్‌‌ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం జీరో లైన్‌‌‌కు పక్కనే ఉందని తెలుస్తోంది. 
 
మూడు ఏకే-47 రైఫిళ్లు, 6 మేగజీన్స్, 91 రౌండ్లు, నాలుగు మేగజీన్స్, 57 రౌండ్లు, రెండు చైనీస్ పిస్టళ్లు, మరో నాలుగు మేగజీన్స్, 20 రౌండ్లను భారత్ -పాక్ సరిహద్దులో స్వాధీనం చేసుకున్నామని ఒక బీఎస్‌‌ఎఫ్ అధికారి తెలిపారు.
 
 ‘ప్లాస్టిక్ బ్యాగులో ప్యాక్ చేసి ఉన్న ఆయుధాలను గుర్తించాం. ఆ ప్రాంతంలోని పలు చోట్ల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌‌‌ఐఆర్‌‌‌లో ఎవరి పేరునూ చేర్చలేదు. విచారణ కొనసాగుతోంది’ అని లఖో కే బెహ్రామ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బీర్బల్ సింగ్ తెలిపారు.