ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్

రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత  ఉండే విధంగా నిర్వాహకులు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.

రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలకు అప్రమత్తం చేశారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రం లోని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద అన్ని భద్రత చర్యలను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షించలని జిల్లా ఎస్పీ లను ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. అట్టి వారి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించదు కటిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.