జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) మరణం పట్ల ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా  సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయ ప్రకాశ్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని .. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని కొనియాడారు. 

వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు జయప్రకాష్ రెడ్డి గారి అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయమని ట్వీట్ చేశారు.

చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది.ఆయన స్థానం భర్తీ చేయలేనిది.ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.