తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మంగళవారం నుంచి సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులు ప్రకటించింది.
దానితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. నేటి నుంచి ఈ స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు వీలు కల్పించారు.
స్టాంపుల కొనుగోలు, చలాన్లు చెల్లించిన వారికి ఇవాళ రిజిస్ట్రేషన్లు అవుతాయని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్ చిరంజీవులు ప్రకటించారు. నేటి నుంచి స్టాంపుల విక్రయాలు పూర్తిగా నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంగళవారం నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని పేర్కొన్నారు.
కొత్త రెవెన్యూ చట్టం దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయంతో రిజిస్ర్టేషన్లు నిలిపివేశామని చిరంజీవులు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోగా రికార్డులను కలెక్టరేట్‌లో అప్పగించాలని వీఆర్వోలకు స్పష్టంచేసింది. రికార్డుల సేకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తికావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ల నుంచి సాయంత్రంలోగా సమగ్ర నివేదిక రావాలని ఆదేశించారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
ఎస్డిఎఫ్ నిధులతోపాటు ఖమ్మంకు అదనంగా సాయం
నివాసముంటున్న ఇళ్లు కూల్చం