దేశ వ్యాప్తంగా ఉన్న జనౌషధి కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన (పిఎంబిజెపి) పథకం కింద రోగ నిరోధక శక్తిని పెంచే ఎనిమిది రకాల ఉత్పత్తులను కేంద్ర రసాయనాలు , ఎరువుల మంత్రి సదానంద గౌడ ప్రారంభించారు.
కొవిడ్-19 విశ్వమహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు క్రొత్త న్యూట్రాసూటికల్స్- రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఉత్పత్తుల వాడాల్సిని అవసరం ఎంతైనా ఉంది. కావున ఈ క్రొత్త ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఉత్పత్తులతో పోలిస్తే నాణ్యమైనవి. ధర కూడా 26% తక్కువ. పోషక విలువలు కలిగిన అనుబంధకాలు, మాల్ట్ లతో తయారు చేసిన పోషకవిలువలు కలిగిన పానీయాలు,
రోగ నిరోధక శక్తిని పెంచేవి ప్రజల ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం, అందువలన దేశ వ్యాప్తంగా కలిగిన జనౌషధి కేంద్రాల ద్వారా ఇవి ప్రజలను చేరుతాయని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న 6500లకు పైగా ఉన్న జనౌషధి దుకాణాలను సుమారు పది లక్షల మంది పౌరువులు సందర్శించి నాణ్యమైన జనరిక్ మందులను కొంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం కింద చక్కెర వ్యాధి, రక్త పోటు, సైకోట్రోపిక్ వంటి వ్యాధులకు మందులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే స్త్రీల రుతు సమయంలో వారి ఆరోగ్య పరిరక్షణకు జనౌషధి కేంద్రాల్లో సువిధ పథకం కింద రు.1 కే సానిటరీ న్యాప్కిన్లను అందిస్తున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ఉద్ఘాటించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేసారు. ఈ పాడ్లలో ఆక్సో-బయోడిగ్రేడబుల్ తత్వం కలిగిన పర్యావరణ హితమైన పదార్థాలు ఉపయోగించి తయారు చేశారు.
2008లో ప్రారంభమైన ఈ దుకాణాల్లో 2016 నాటికి 99 మాత్రమే ఉండగా, ప్రధాని దార్శనికతతో లాజిస్టిక్స్, ఐటి వంటి ప్రారంభ కేంద్రాలను వీటిని సంస్కరించారు. ప్రస్తుతం 734 జిల్లాలకు గాను 732 జిల్లాల్లో 6587 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు ,ఎరువుల శాఖ స్వతంత్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య పరిరక్షణకు రోగనిరోధక శక్తి పెంపొందించుకొనుటకు పోషకాలతో తయారు చేసిన ఈ ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జనౌషధి కేంద్రాలను సంస్కరించిన తరువాత నాణ్యమైన జనరిక్ మందుల అమ్మకం, వినియోగం బాగా పెరిగిందని చెప్పారు.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్కతా పోలీస్ కమిషనర్పై వేటుకు మమతా సమ్మతి