ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్ కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ డిమాండ్ చేశారు. వెనువెంటనే ఆ హ్యాకర్ బోగస్ ట్వీట్‌లను డిలీట్ చేశారు.
 
 ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌పై క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ట్వీట్ వచ్చింది. ట్విట్టర్ అకౌంట్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దానిలో కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన పీఎం మోదీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేయాలని కోరారు. 
 
మోదీ ట్విట్టర్ అకౌంట్‌ జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది. ఈ హ్యాకర్ గ్రూప్ పేరు జాన్ విక్. ఈ గ్రూప్ కు పేటీఎం మాల్ డేటా చోరీలో హస్తముందనే ఆరోపణలున్నాయి. 
 
పేటీఎం మాల్ యూనిఫార్మ్ అనేది పేటీఎంకు చెందిన ఈ-కామర్స్ కంపెనీ. కాగా ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌కు 25 లక్షలకు మించిన ఫాలోవర్లు ఉన్నారు.