ప్రభుత్వ జోక్యంపై మరోసారి హైకోర్టు కు నిమ్మగడ్డ 

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) విధుల్లో ఏపీ  ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆరోపించారు. ఎస్‌ఈసీ స్వతంత్రతను అణచివేసేలా సర్కారు పావులు కదుపుతోందంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. 

అదేవిధంగా తమ సిబ్బందిపై సీఐడీ నమోదు చేసిన కేసును రాజ్యాంగ విరుద్ధం గా ప్రకటించాలని, ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ అధికారులు ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ఉపయోగించిన కంప్యూటర్‌ను, అం దులోని డేటాను తీసుకెళ్లారని చెబుతూ వారు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నిటినీ తిరిగి ఇచ్చేలా ఆదేశా లివ్వాలని కోరారు.

గతంలో తాను కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు వచ్చిన సీఐ డీ అధికారులు ఆ విషయాన్ని పక్కనబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలను తె లుసుకునేందుకే ఆసక్తి ప్రదర్శించారని ఆరోపించారు.

పని చేయని కంప్యూటర్‌ను ఫార్మాట్‌ చేసినందుకు సాంబమూర్తిని సీఐడీ అధికారులు  వేధించడమే గాక సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ ఆయనపై తప్పు డు కేసు బనాయించారని తెలిపారు. కమిషన్‌ను, ఉద్యోగులను వేధించేందుకే ఆ కేసు పెట్టారని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కాగా, సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాల ని కోరుతూ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పిటిషన్లను కలిపి విచారించేలా తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.