రియాతో సంబంధం ఉన్న స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్

రియాతో సంబంధం ఉన్న స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్

సినీ నటి రియా చక్రవర్తి ,ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తికి డ్రగ్స్ అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సుశాంత్ కేసు ద‌ర్యాప్తు చేప‌డుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా ఆమె సోద‌రుడు షోయిక్ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ ల‌పై విచార‌ణ చేప‌ట్టారు.

విచార‌ణ‌లో భాగంగా వారు డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ కు పాల్ప‌డిన‌ట్లు కొన్ని ఆధారాలు ల‌భ్య‌మ‌య్యాయి. వాటి ఆధారంగా న‌లుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెల్ల‌డించారు.

ఆగస్టు 27, 28 తేదీలలో ఎన్సీబీ అధికారులు అబ్బాస్ లఖాని, కర్న్ అరోరాను అరెస్టు చేశారు. వారి వ‌ద్ద‌నుంచి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం ఎన్సీబీ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దర్యాప్తులో అబ్బాస్‌కు బాంద్రా నివాసి జైద్ విలాత్రతో సంబంధాలున్నట్లు తేలింది.

దీంతో రాత్రి ఎన్సీబీ అధికారులు జైద్ విలాత్ర ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ. 9,55,750 ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పెద్ద‌మొత్తాన్ని డ్ర‌గ్స్ ను స‌ర‌ఫ‌రా చేసేందుకు వినియోగించుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.