చైనాకు ధైర్యంగా ఎదురు నిలబడటమే మార్గం 

చైనాకు ధైర్యంగా ఎదురు నిలబడటమే మార్గం 

చైనా దుందుదుడుకు చర్యల్ని అడ్డుకోవాలంటే చైనాకు   ధైర్యంగా ఎదురు నిలబడటమే మార్గమని అమెరికా స్పష్టం చేసింది.  భారత్-చైనా సరిహద్దు వద్ద నెలకొన్న పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది.

ఇంటా బయటా తరచూ చైనా కయ్యానికి కాతైవాన్ మొదలు జింగ్‌జియాంగ్, దక్షిణ చైనా సలుదువ్వుతున్న తీరు పట్ల అమెరికా ఆందోళన ప్రకటించింది.  కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాను నిలువరించాలంటే నేరుగా ఆ ప్రయత్నాలను ఎదుర్కోవడమేనని అమెరికా స్పష్టం చేసింది.

సముద్రం, హిమాలయాలు, సైబర్ ప్రపంచం ఇలా అనేక వేదికలపై చైనా ఇదే తీరున వ్యవహరిస్తోందని మండిపడింది. సొంత ప్రజల్ని అణిచివేస్తూ పొరుగు దేశాలపై బెదిరింపులకు దిగుతోందని దుయ్యబట్టింది. 

అయితే భారత్, చైనా శాంతియుతంగా సమస్యను  పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్టు అమెరికావిదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు.. అమెరికా పెంటగాన్‌ కూడా చైనా దుర్నీతి ప్రదర్శిస్తోందంటూ మండిపడింది. ‘బెదిరింపుల ద్వారా ఒత్తిడి పెంచుతూ చైనా తనకు కావాల్సింది సాధించుకునే ప్రయత్నం చేస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రం, భారత్, భూటాన్ సరిహద్దు వద్ద ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది’ అని పేర్కొన్నది. 

పూర్తి స్థాయి యుద్ధానికి దిగకుండా ఇటువంటి   రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ అమెరికా మిత్ర దేశాలపై ఒత్తడి తెస్తోందని వ్యాఖ్యానించింది.

అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక  నివేదికలో పెంటాగాన్ ఈ విషయాన్ని వెల్లడించింది.   నాథ్ ఫోన్లో సంభాషించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని రాజ్‌నాథ్ అభ్యర్థించారు.