కరోనా సమయంలో రైతుల సామర్ధ్యం భేష్ 

కరోనా సమయంలో రైతుల సామర్ధ్యం భేష్ 
కరోనా మహమ్మారి సమయంలోనూ భారత రైతులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. ఖరీఫ్ పంటల సాగు గత సంవత్సరంతో పోలిస్తే ఏడుశాతం అధికంగా ఉందని తెలిపారు. 
 
రుగ్వేదంలో ఒక మంత్రం ఉంది.. ‘అన్నాన్ని ఇచ్చేవాడు.. రైతును పొగడాలి’ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ సత్తా చాటారన్నారు. ఖరీఫ్‌లో పంటలను విత్తడం ఏడు శాతం.. గత సంవత్సరంతో పోలిస్తే వరి 10శాతం ఎక్కువ, పప్పుధాన్యాలు 5 శాతం, పత్తి 3శాతం, ముతక ధాన్యం, వోట్స్, తృణధాన్యాలు 3శాతం, నూనె గింజలు 13 శాతం’ అని ప్రధాని పేర్కొన్నారు. 
 
‘నేను దేశ రైతులను అభినందిస్తున్నాను. ముందు వారి శ్రమకు నమస్కరిస్తున్నాను’ అన్నారు. కేరళ సంప్రదాయ పండుగ ఓనమ్‌ వ్యవసాయంతో ముడిపడి ఉందని చెప్పారు. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కొత్త ప్రారంభం సమయం. 
 
‘మన జీవితాలు, సమాజం వ్యవసాయం శక్తితో నడిచేవి. మన రైతుల జీవనశక్తిని కూడా వేదాలు ఎంతో ఘనంగా వర్ణించాయి’ అని ప్రధానిథెయ్లిపారు. ఓనమ్‌ పండుగ అంతర్జాతీయ పండుగగా మారిందని ఆయన పేర్కొన్నారు. 
 
ఓనమ్‌ నేడు సుదూర తీరాలకు చేరుకుంది. అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలైనా.. సరే ప్రతిచోటా అనుభూతి చెందవచ్చని చెప్పారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు.  
యువత ఆత్మా నిర్భయ్ భారత్ లో క్రియాశీల పాత్ర వహిస్తూ అనేక కొత్త యాప్ లను ఆవిష్కరిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ‌లనే వాడాలని ప్రధాని పిలుపునిచ్చారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని, స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు.