గేమింగ్‌ స్కామ్ లో రూ.46.96 కోట్లు ఫ్రీజ్    

చైనా ఆన్‌‌లైన్‌‌ గేమింగ్‌‌ స్కామ్‌‌లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బెట్టింగ్‌‌ యాప్స్‌‌ ద్వారా వసూలు  చేసిన హెచ్‌‌ఎస్‌‌బీసీ బ్యాంక్‌‌లోని రూ.46.96 కోట్లను శనివారం ఫ్రీజ్ చేసింది. 

ఢిల్లీ, గుర్గావ్, ముంబయి, పుణెలోని 15 ప్రాంతాల్లో దాడులు చేసి.. ఆన్‌‌లైన్‌‌ బెట్టింగ్‌‌ కంపెనీలు నిర్వహిస్తున్న డైరెక్టర్లు, చార్టెడ్‌ అకౌంటెంట్స్‌‌ ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టింది. మొత్తం 17హార్ట్‌‌ డిస్క్‌‌లు, 5ల్యాప్‌‌టాప్ లు, ఫోన్లు స్వాధీనం చేసుకుంది.

డొకిపే టెక్నాలజీ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌, లింక్యూన్‌‌తోపాటు మరికొన్ని కంపెనీలపై ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌ పోలీసులు అరెస్ట్ చేసిన యాన్‌‌ హవో బీజింగ్‌‌ టుమారో పవర్‌‌‌‌ కంపెనీకి మేనేజర్‌‌‌‌గా పని చేస్తున్నట్లు గుర్తించింది. ఢిల్లీకి చెందిన ధీరజ్‌‌ సర్కార్‌‌‌‌, అంకిత్‌ కపూర్‌‌‌‌తో కలిసి బెట్టింగ్‌‌ స్కామ్‌‌ చేసినట్లు ఆధారాలు సేకరించింది. 

డోకిపేకి చెందిన 2 బ్యాంక్‌‌ అకౌంట్స్​లో గతేడాది రూ.1,268 కోట్లు డిపాజిట్‌‌ అయ్యాయి. ఇందులో రూ.300 కోట్లు పేటీఎం గేట్‌‌వే ద్వారా వచ్చాయి. రూ.600 కోట్లు ట్రాన్స్​ఫర్‌‌‌‌ అయ్యాయి. లింక్యూన్‌‌ టెక్నాలజీ నుంచి రూ.120 కోట్ల మనీల్యాండరింగ్‌‌ జరిగింది. ఇండియన్‌‌ కస్టమర్లను టార్గెట్‌‌ చేసిన ఆన్‌‌లైన్‌‌ చైనీస్‌‌ డేటింగ్‌‌ యాప్స్‌‌ ద్వారా హవాలా ట్రాన్సాక్షన్‌‌ జరిగినట్లు అనుమానిస్తోంది.