బిజెపిలోకి స్టార్‌ క్రికెటర్లు గంగూలి, ధోనీ?

Kolkata: Former cricketer Sourav Ganguly and Indian captain MS Dhoni ahead of the third T20 match between India and South Africa at Eden Gardens in Kolkata, on Oct 8, 2015. (Photo: IANS)

టీమిండియా మాజీ కెప్టెన్లు ఇద్దరు బిజెపిలో చేరబోతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. సినీ పరిశ్రమలోనూ, క్రీడా రంగంలోనూ మంచి పేరున్న అనేకమంది రాజకీయ పార్టీలలో చేరి చట్టసభలకు ఎన్నిక కావడం, కొందరు మంత్రి పదవులు కూడా చేపట్టడం తెలిసిందే.

ఇప్పటికే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గౌతమ్‌ గంభీర్‌ బిజెపిలో చేరి లోక్‌సభ ఎంపిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు యావత్‌ దేశం మాజీ క్రికెటర్లయిన సౌరవ్‌ గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించుకుంటోంది. ఇద్దరూ బిజెపిలో చేరతారనే వార్తలు ప్రచారం అందుకున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే బబుల్‌ సుప్రియో వంటి స్టార్‌ సింగర్‌ బిజెపిలో ఉన్నారు. కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడ యూత్‌లో దాదాకు మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. దాదాను తీసుకుంటే బిజెపికి పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి రావొచ్చనే కధనాలు వెలువడుతున్నాయి.

దాదా తీసుకున్న ఓ నిర్ణయం కూడా బిజెపిలోకి గంగూలీ వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది. గంగూలీ ఆధ్వర్యంలోని ట్రస్టు కోల్‌కతాలో ఓ పాఠశాలను నెలకొల్పేందుకు మమతా ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించింది. ఆ స్థలం వివాదంలో చిక్కుకోవడంతో దాదా ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చేశాడు.

దీంతో దాదా మమతాతో విభేదించి బిజెపిలో చేరతాడని అక్కడ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పశ్చిమ బెంగాల్‌ బిజెపి సిఎం అభ్యర్థి గంగూలీనే అంటూ హాట్‌ హాట్‌గా డిబేట్‌ సాగుతోంది.

మహేంద్రసింగ్‌ ధోనీ, సురేష్‌ రైనా కూడా బిజెపిలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. వీరి రాజకీయ ప్రవేశంపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ధోనీ బిజెపిలో చేరితే జార్ఖండ్‌లో బిజెపికి తిరుగుండదనే ప్రచారం జరుగుతున్నది.