తెలంగాణ ప్రభుత్వం కరోనాపై మరింత మెరుగ్గా పని చేయాలని, టెస్టుల సంఖ్య పెంచాలంటూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హితవు చెప్పారు.
గవర్నర్ వృత్తిపరంగా డాక్టర్ అని ఆమె చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగతంగా దేశ పౌరురాలిగా ఆమె సలహాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
అయితే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కరోనాపై పోరాటం చేస్తున్నామని తెలిపారు.
ముద్ర పధకంలో రుణాలు మంజూరైన లబ్దిదారులకు చెక్కులను అందజేస్తూ ఆత్మనిర్భాన్ లో భాగంగా చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి ముద్ర పధకం కింద రుణాలు అందిస్తున్నామని తెలిపారు.

More Stories
శంషాబాద్ విమానాశ్రయానికి తగ్గిన విదేశీ ప్రయాణికుల రద్దీ
స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల ఫోటోలపై దుమారం
నల్సార్ లా విద్యార్ధులపై బార్ కౌన్సిల్ నిషేధం.. ఉపసంహరణ!