కరోనా కారణంగా దేశంలో సినిమాలు, టీవీ కార్యక్రమాల షూటింగులు మార్చి నుంచి ఆగిపోయాయి. వాటన్నింటిని తిరిగి ప్రారంభించడం కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ ఎస్‌ఓపిలను ఖరారు చేసినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటిచా రు.
కెమెరా మెన్ లు తప్ప మిగతా వారందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు కచ్చితంగా ధరించాలి. ఈ నిబంధనలను అనుసరిస్తూ సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్ తిరిగి ప్రారంభించవచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు షూటింగులకు అనుమతులిచ్చాయి.
ఆయా రాష్ట్రాలు కూడా కేంద్ర నిబంధనలను తప్పకుండా పాటించాలి. అవసరమైతే రాష్ట్రాలు మరికొన్ని షరతులు కూడా పెట్టుకోవచ్చు. సినిమాలు, టీవీలు ఆర్థికవ్యవస్థకు చాలా సహాయపడతాయి. సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్ తిరిగి ప్రారంభించడం వల్ల ఉపాధి కూడా పెరుగుతుంది’అని జవదేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్గదర్శకాలు ఇవే..
- కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్‌లో పాల్గొనాలి.
- చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
- ఆరోగ్య సేతు యాప్‌ని నటీనటులంతా వినియోగించాలి.
- షూటింగ్ సమయంలో విజిటర్లకు అనుమతి ఇవ్వద్దు.
- మేకప్ సిబ్బంది ఖచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
- తక్కువ సిబ్బందితో షూటింగ్‌లో చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.
- పరిశ్రమలో హైరిస్క్ కలిగినవారు అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఫేస్ మాస్కులు, షీల్డులు పని ప్రదేశాలు, షూటింగ్ ప్రదేశాల్లో తప్పనిసరి.
- వీలైనంత వరకు ఆరు అడుగుల మేర దూరాన్ని పాటించాలి.
- తక్కువ సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలి.
- స్టూడియోల్లో వేర్వేరు యూనిట్లకు వేర్వేరు సమయాలు కేటాయించాలి
- ఎంటెన్స్, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఉండాలి.
- సెట్లు, మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్లు, టాయిలెట్లను తరచుగా శానిటైజ్ చేయాలి.
- గ్లౌజులు, మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచుకోవాలి
- షూటింగ్ వస్త్రాలు, విగ్గులు, మేకప్ మెటీరియల్ ఇతరులతో పంచుకోకుండా చూడాలి.
- కెమెరాలు, పరికరాలను ఒకరికంటే ఎక్కువ ఉపయోగిస్తే.. కచ్చితంగా సిబ్బంది గ్లౌజులు ధరించాలి.
- లేపల్ మైకులను దూరం పెట్టాలి. లేకుంటే వాడకం వీలైనంతగా తగ్గించాలి.
- సినిమా థియేటర్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ కాకుండా చర్యలు చేపట్టాలి.
- లోపలికి ప్రవేశించే మార్గాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి.
- కొవిడ్ జాగ్రత్తలు తెలిపే పోస్టర్లు, సందేశాలు ఏర్పాటు చేయాలి.
- థియేటర్లలో సోషల్ డిస్టెన్సింగ్ అమలు చేస్తూ సీటింగ్ ఏర్పాటు చేయాలి.
- టికెట్ల అమ్మకాల్లో ముట్టుకోవాల్సిన పని లేకుండా ఆన్‌లైన్ బుకింగ్స్, ఈ-వాలెట్లు, క్యూఆర్ కోడ్ స్కానర్లు వినియోగించాలి.
- తరచుగా పని ప్రదేశాలను శానిటైజ్ చేస్తూ ఉండాలి.
- అనుమానిత కేసులు ఉంటే సెల్ప్ ఐసోలేషన్ ఉండాలి.
More Stories
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
మణిపూర్‌లో భారీగా ఆయుధాలు లభ్యం
రైలును పట్టాలు తప్పించేందుకు మరోసారి కుట్ర