డిస్కామ్‌లకు కేంద్రం వెసులుబాటు

విద్యుత్ వ్యవస్థలో ఆర్థిక ఒత్తిడిని తగ్గించేలా విద్యుత్ మంత్రిత్వ శాఖ  చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో పీఎఫ్‌సీ , ఆర్ఈసీ లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ పథకం కింద చేప‌ట్టిన అన్ని చెల్లింపులకు సంవత్సరానికి 12 శాతం మించకుండా (సాధారణ వడ్డీ) ఆలస్య చెల్లింపు సర్‌చార్జిని వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచించింది.

దీనికి సంబంధించి అన్ని విద్యుత్ జనరేటింగ్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీలకు సూచ‌న చేసింది. తాజా చ‌ర్య‌తో డిస్కామ్‌లపై ఆర్థిక భారం తగ్గ‌నుంది. గత కొన్నేళ్లుగా దేశంలో సాధార‌ణ వడ్డీ రేట్లు దిగివ‌చ్చినప్పటికీ, కొన్ని ర‌కాల ఆలస్యపు చెల్లింపు సర్‌చార్జీల రేటు ఎక్కువగా ఉంటున్నది.

అనేక సందర్భాల్లో ఎల్‌పీఎస్‌ రేటు సంవత్సరానికి 18శాతం వరకు ఉంటూ వ‌స్తోంది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా విధించిన క్లిష్ట‌మైన లాక్‌డౌన్ ప‌రిస్థితులు ఆయా డిస్కామ్‌లపై ప్రతికూలంగా ప్రభావితం చూపాయి. కోవిడ్‌-19 మహమ్మారి విద్యుత్ రంగం, ముఖ్యంగా పంపిణీ సంస్థల అన్ని భాగాస్వామ్య‌ప‌క్షాల వారి ద్రవ్య స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేప‌ట్టింది. సామర్థ్య ఛార్జీలపై రిబేటు, విద్యుత్ షెడ్యూల్ కోసం క్రెడిట్ లెటర్ సడలింపు నిబంధనతో పాటుగా లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ స్కీమ్ మొదలైన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌భుత్వం చేప‌ట్టిన చర్యలలో లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎల్‌పీఎస్) ఒక‌టి.

జూన్ 30, 2020 వరకు విద్యుత్ కొనుగోలు , విద్యుత్ ప్రసారం కోసం ఉత్పాదక సంస్థలకు , ప్రసార లైసెన్స్‌దారులకు పంపిణీ సంస్థలు ఆలస్యం జ‌రిగిన‌ సందర్భంలో ఎల్‌పీఎస్ వర్తిస్తుంది. కష్టతరమైన సమయాల్లో వినియోగదారులకు సజావుగా విద్యుత్ సరఫరా జ‌రిపేందుకు, విద్యుత్ ఛార్జీలను తగ్గించ‌డానికి ప్ర‌భుత్వం చ‌ర్య దోహ‌దం చేస్తుంది.