
ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్ వెల్లడించారు.
మరోవైపు ట్రయల్స్ అన్ని విజయవంతమైన పక్షంలో ఆక్స్‌ఫర్డ్ టీకా ‘కోవిషీల్డ్’ 2020 చివరి నాటికి భారతీయులకు అందుబాటులోకి రావచ్చునని కూడా పలు రిపోర్టులు చెప్తున్నాయి.
వీటితోపాటుజై డుస్ కాడిలా తయారు చేస్తున్న ‘జైకోవ్ డీ’, ఆక్స్‌ఫర్డ్ ‘ఆస్ట్రాజెనికా’తో జతకట్టిన సీరం ఇన్స్‌స్టిట్యూట్ ట్రయల్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఇవి కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హర్షవర్ధన్ వెల్లడించారు. వ్యాక్సిన్ల తయారీలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
సురక్షిత వ్యాక్సిన్‌తోపాటు సరసమైన ధరలకే దానిని ప్రజలకు అందించే దిశగా ఆయా కంపెనీలు పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇక భారత్‌లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత 50 లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. దానికోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
More Stories
దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం
పాకిస్థాన్ ను నాలుగు దేశాలుగా విడగొట్టాలి!
మరోసారి స్మిత అగర్వాల్ ట్వీట్ తో ఇరకాటంలో ప్రభుత్వం!