ఎంపీలో స్థానికులకే ప్రభుత్వోద్యోగాలు   

స్థానికులకే ప్రభుత్వోద్యోగాలు ఇచ్చేందుకు అవసరమైన చట్టపరమైన నిబంధనలను అమల్లోకి తీసుకొస్తామని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రాష్ట్ర వనరులు రాష్ట్రవాసులకేనని స్పష్టం చేశారు 
 
 ‘‘ప్రభుత్వోద్యోగాలు మధ్య ప్రదేశ్ యువతకే ఇవ్వాలనే ముఖ్యమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీని కోసం మేము అవసరమైన చట్టపరమైన నిబంధనలను రూపొందిస్తున్నాం. మధ్య ప్రదేశ్ వనరులు రాష్ట్ర బిడ్డల కోసం ఉద్దేశించినవే’’ అని చౌహాన్ ఓ వీడియో ప్రకటనలో వెల్లడించాయిరు. 

స్వాతంత్య్ర  దినోత్సవాల సందర్భంగా మాట్లాడినపుడు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదేవిధంగా చెప్పారు. ప్రభుత్వోద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 10వ, 12వ తరగతుల్లో పొందిన మార్కుల ఆధారంగా యువతకు ఉద్యోగాలు కల్పించే యంత్రాంగాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. 

మంగళవారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ‘అవసరమైన చట్టపరమైన నిబంధనల’ను రూపొందిస్తున్నట్లు చెప్పారు, కానీ, ఆ నిబంధనల గురించి వివరించలేదు.