ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు   

ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు   

దేశంలో అత్యధిక కాలంపాటు పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోదీ   గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. బిజెపి నేత వాజ్ పేయి అన్ని దఫాల్లో కలిపి 2268 రోజులు ప్రధాని పదవిలో ఉండగా,  ప్రధాని మోడీ భారత చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన నాల్గవ ప్రధానమంత్రి అయ్యారు.

ప్ర‌ధానిగా మోదీ 2014, మే 26న బాధ్య‌త‌లు చేపట్టి 2020, ఆగ‌స్టు 14 నాటికి 2,273 రోజులు పూర్త‌వుతుంది. అంటే ఆయ‌న ఆగ‌స్టు 15న మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి కంటే ఎక్కువ కాలం ప‌దవిలో కొన‌సాగిన ప్ర‌ధానిగా వ్య‌క్తిగా నిలుస్తారు.    

కాంగ్రెస్‌ పార్టీ నుంచి సుదీర్ఘ కాలం దేశ ప్రధా‌ను‌లుగా జవ‌హ‌ర్‌‌లాల్‌ నెహ్రూ, ఇంది‌రా‌గాంధీ, మన్మో‌హన్‌ సింగ్‌ సేవ‌లం‌దిం‌చారు.  జవహర్ లాన్ నెహ్రూ 16సంవత్సరాల 286 రోజులు పని చేశారు.ఆయన  కుమారై ఇందిరా గాంధీ 15 సంవత్సరాల 350 రోజులు పాటు పనిచేశారు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4రోజులు పనిచేశారు. వీరు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

భారత 14వ ప్రధానిగా మోదీ  మే 26, 2014 న ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి రెండోసారి ప్రధానిగా మే 30, 2019 న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రెండో రికార్డును కూడా ప్రధాని సొంతం చేసుకున్నారు. ఆగస్టు 15న ప్రధాని హోదాలో ఎర్రకోటపై నుంచి జాతీయ జెండాను ఎక్కువ సార్లు ఎగుర వేసిన ప్రధానుల జాబితాలో నరేంద్ర మోదీ  నాలుగో స్థానంలో ఉన్నారు.

భార‌త‌దేశానికి కాంగ్రేసేత‌ర ప్ర‌ధానులుగా మోరార్జీ దేశాయ్‌, చ‌ర‌ణ్ సింగ్‌, వీపీ సింగ్‌, చంద్రశేఖ‌ర్‌, హెచ్‌డీ దేవేగౌడ‌, ఐకే గుజ్ర‌ల్ ప‌నిచేశారు. అయితే వీరిలో ఏ ఒక్క‌రూ పూర్తిగా ఐదేండ్ల‌పాటు ప‌ద‌విలో కొన‌సాలేదు.