
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్‌లైన్ 82971 04104 నెంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
హెల్ప్‌లైన్ ద్వారా కరోనా లక్షణాలు, పరీక్షల వివరాలు, హోమ్ ఐసోలేషన్ జాగ్రత్తలు వివరించనున్నారు. కొవిడ్ సెంటర్‌లో చేరే ప్రక్రియ, అంబులెన్స్ సాయం వివరాలు తెలియజేస్తారు. టెలీమెడిసిన్, 104 కాల్‌సెంటర్ వివరాలు తెలపనున్నారు.
హెల్ప్‌లైన్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితి చెప్పుకుని కరోనా వ్యాధి నిర్థారణకు సంబంధించిన సందేహాలు తీర్చుకునే సౌలభ్యం కల్పించినట్లు అధికారులు వివరించారు.
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రతిరోజూ పది వేలకు చేరువలో కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 55,692 కోవిడ్ టెస్టులు నిర్వహించగా 9,996 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది.
కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2378కు చేరుకుంది.
రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తుండటంతో కోవిడ్ పరీక్షల సంఖ్య 27 లక్షలు దాటింది. ఈ నెల 13 నాటికి మొత్తం పరీక్షల సంఖ్య 27,05,459కు చేరుకుంది.
More Stories
శారదా పీఠం భవనం స్వాధీనంకు టిటిడి నోటీసు
అన్యమత ప్రిన్సిపాల్ పై టిటిడి వేటు!
విశాఖ మేయర్‌పై నెగ్గిన కూటమి అవిశ్వాస తీర్మానం