తెలంగాణకు కరొనకట్టడిలో కేంద్రం భారీ చేయూత 

A ventilator can help patients unable to breathe on their own, but the experience of COVID-19 patients has been sobering for doctors.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వానికి  కేంద్రంలోని నరేంద్ర మోదీ  ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఆర్థికసాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే ఎక్కువగా వెంటిలేటర్లు, హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్, ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లుసరఫరా చేస్తోంది. 
 
జులై 28 నాటికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలను పరిశీలిస్తే  కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే ఎక్కువగా పరికరాలను కేంద్రం సరఫరా చేసింది.  కరోనా రోగుల పరిస్థితి జఠిలమైతే వారి ప్రాణాలను కాపాడేందుకు వెంటిలేటర్లు చాలా కీలకం. ఐసీయూలో చికిత్సకు సహితం ఇవే ఆధారం. కరోనా కంటే ముందు మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న మొత్తం వెంటిలేటర్లు 192 మాత్రమే. 
 
కరోనా విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కేంద్రం వెంటిలేటర్ల ఎగుమతిని నిలిపివేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఈ క్రమంలోనే దేశంలో అత్యధికంగా 5.24 లక్షల పాజిటివ్ కేసులు దాటిన మహారాష్ట్రకు 3,463 వెంటిలేటర్లు పంపింది. 
 
3 లక్షలకు పైగా కేసులున్న తమిళనాడుకు 568 వెంటిలేటర్లు, 2.35 లక్షల కేసులున్న ఆంధ్రప్రదేశ్ కు 570, కర్నాటక (1.78 లక్షల కేసులు)కు 710, ఢిల్లీ(1.46 లక్షల కేసులు)కు 525, ఉత్తర ప్రదేశ్(1.26 లక్షలు)కు 462 వెంటిలేటర్లను సరఫరా చేసింది. 71 వేల కేసులున్న గుజరాత్ కు 1,494 వెంటిలేటర్లు అందించింది.
కాగా, 80 వేల పాజిటివ్ కేసులు ఉన్నతెలంగాణకు 1,400 వెంటిలేటర్లు కేటాయించి 1,175 అందజేసింది. మొత్తంగా మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత ఎక్కువగా వెంటిలేటర్లు తెలంగాణకే సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కేవలం 1,000 వెంటిలేటర్లు మాత్రమే కావాలని మే నెలలో ప్రతిపాదనలు పంపితే అంతకంటే అదనంగా వెంటిలేటర్లను కేంద్రం పంపించడం గమనార్హం.