కేసీఆర్ లేకుండా కేటీఆర్ తో మంత్రివర్గ సమావేశం 

ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకొంటుంటే మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశం జరిపారు. ఈ సమావేశం ఏకంగా 8 గంటల పాటు జరిగింది. ప్రభుత్వ ప్రధాన అకార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు  అందరు హాజరయ్యారు.
బహుశా భారత దేశంలో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అంబాటులో ఉండగా మరో మంత్రి మంత్రివర్గ సమావేశం జరపడం ఎప్పుడు జరిగి ఉండదు. కేవలం ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో, అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాత్రమే అటువంటి సమావేశాలు జరుపుతూ ఉంటారు. ఒక వేళ ఆ విధంగా జరుపవలసి వచ్చినా ఉపముఖ్యమంత్రి ఒకరు ఉన్నారు. 
 
ఆహార శుద్ధి, లాజిస్టిక్స్ విధానాలపై చర్చించడానికి, తగు మార్గదర్శకాల రూపకల్పనకు  బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మేధోమథనం జరిగిన్నట్లు ఒక అధికార ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై తొలత మంత్రులకు కెటిఆర్ వీడియో ప్రజెంటేషన్ చేశారు. 
 
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు నాటి హోం మంత్రి దేవేందర్ గౌడ్ సచివాలయంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించడం లేదని వార్త తెలిసినప్పుడు నాటి ఆర్ధిక మంత్రి రోశయ్య క్యాంపు ఆఫీసులో మంత్రులతో సమావేశం జరిపారు. 
 
తొలి ప్రభుత్వంలో కేసీఆర్ చైనా, సింగపూర్, మలేషియా పర్యటనకు వెళ్లినప్పుడు తన వద్ద ఉన్న శాఖలను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి అప్పగించారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలా ఆధ్వర్యంలో మంత్రులంతా సమావేశమైన సందర్భాలు లేవు.
 
ఇప్పటివరకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ మాత్రమే మంత్రులతో సమావేశాలు జరుపుతూ వచ్చారు. రాష్ట్రం వచ్చిన మొదట్లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే నుంచి ఈ మధ్య అమల్లోకి వచ్చిన షరతుల సాగు విధానం వరకు ఆయనే మంత్రులతో సమావేశాలు జరిపి  ర్ణయాలు తీసుకున్నారు. 
 
కానీ మొదటిసారి కేటీఆర్ ప్రగతిభవన్ లో, అది కూడా కీలక విధానాలపై మంత్రులందరితో సమావేశం నిర్వహించడం  ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ విస్మయం కలిగిస్తున్నది. కేటీఆర్ ను అనధికారికంగా ముఖ్యమంత్రి అని చెప్పడం కోసమేనా?