అమెరికా ఉపాధ్యక్ష రేసులో తెలుగు మహిళ

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో తెలుగు మహిళకు అవకాశం లభించింది. గతంలో అమెరికాలో సెనేటర్ గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ  కమలా దేవీ హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష  పదవికి పోటీకి దిగుతున్నారు.

కమలను ఉపాధ్యక్షురాలిగా ప్రకటిస్తూ డెమొక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బిడెన్ స్వయంగా ట్వీట్ చేశాడు. నవంబర్ లో జరిగే ఎన్నికలలో బిడెన్ గెలిస్తే అత్యంత పెద్ద వయసు గల అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతాడు.

కమల హారిస్ ఈ పోటీలో గెలిస్తే అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్రకెక్కుతుంది. అంతేకాకుండా అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి తెలుగు మహిళ కూడా అవుతుంది. ఆమె సెనేటర్ కాకముందు శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా న్యాయవాదిగా,  కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కూడా పనిచేశారు. 

జో బిడెన్ కుమారుడు బ్యూతో హారిస్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధమే హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ బరిలో నిలిపిందని బిడెన్ తెలిపాడు. హారిస్ గతంలో బిడెన్ తో పాటు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ, అనూహ్య పరిణామాల వల్ల ఆమె అధ్యక్ష పోటీ నుంచి తప్పుకొని బిడెన్ కు అవకాశం  ఇచ్చారు.