జగన్ స్నేహితుడైతే ప్రాజెక్టులు ఆపించు కేసీఆర్ 

జగన్ స్నేహితుడైతే ప్రాజెక్టులు ఆపించు కేసీఆర్ 

ఏపీ సీఎం జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ స్వయంగా ఒప్పుకొన్నారని, అలాంటప్పుడు మన దక్షిణ తెలంగాణ ఎడారయ్యేలా ఆ రాష్ట్రం చేపడ్తున్న ప్రాజెక్టులు ఆపేలా కోరాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌‌‌‌‌‌‌‌ కమిటీ సభ్యుడు వివేక్‌‌‌‌‌‌‌‌వెంకటస్వామి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

జగన్‌‌‌‌‌‌‌‌ను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌కు పిలిపించుకుని మాట్లాడాలని హితవు చెప్పారు. గతంలో ఆంధ్రా కాంట్రాక్టర్లు ప్రగతిభ వన్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలోనే కేసీఆర్‌‌‌‌‌‌‌‌, జగన్‌‌‌‌‌‌‌‌ ఇద్దరూ కమీషన్లు, లావాదేవీల గురించి మాట్లాడుకున్నారని వివేక్ ఆరోపించారు. 

నీళ్లవిషయంలో జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకనే అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసు వేశామని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్తున్నారని, గతంలోనే బచావత్‌‌‌‌ అవార్డుపై సుప్రీంలో కేసు వేసినప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే నీళ్ల పంపకాలు చేసుకోవాలని సూచించిందని వివేక్ గుర్తు చేశారు.

వివాదంలోకి కర్నాటక, మహారాష్ట్రలను తీసుకురావద్దని కూడా పేర్కొన్నదని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ సర్కారు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టడానికే సుప్రీంలో పిటిషన్ వేసిందని, కర్నాటక, మహారాష్ట్రలను రెస్పాండెం ట్లుగా చేర్చారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేస్తున్న నీళ్లదోపిడీని ఆపకుండా జనాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.