కరొనాలో అధ్వానపు జిల్లాలుగా మేడ్చల్,హైదరాబాద్ 

కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ ఘనత దేశం అంతా వెల్లడి అవుతున్నది.   దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు, టెస్టుల నిర్వహణ అధ్వానంగా ఉన్న 16 జిల్లాల జాబితాలో తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు చేరాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక జనాభా ఉన్న ఈ రెండు జిల్లాల్లో టెస్టులు తక్కువగా ఉంటున్నాయని, పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలురాష్ట్రాల్లోని 16 జిల్లాలను పరిస్థితులు అధ్వాన్నంగా  ఉన్న హాట్ స్పాట్ జిల్లాల జాబితాలో చేర్చింది. 

అందులో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతోపాటు మన తెలంగాణలోని ఈ రెండు జిల్లాలు ఉన్నాయి. కోవిడ్ గైడ్ లైన్స్ అమలు,టెస్టుల సంఖ్య, పాజిటివ్ రేటు, మరణాల సంఖ్య, వైరస్ నియంత్రణ చర్యల ఆధారంగా ఈ జాబితాను ప్రకటించారు. 

తెలంగాణలో తొలి నుంచీ హైదరాబాద్, మేడ్చల్జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ రోజువారీ కేసుల్లో ఈ జిల్లాల నుంచి ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తంపాజిటివ్ కేసుల్లోసగానికిపైగా ఈ జిల్లాల్లో నే ఉన్నారు. ఈ జిల్లాల్లో పాజిటివ్ రేటు ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

మొదట్లోహైదరాబాద్ లోనే కరోనావ్యాప్తి ఎక్కువగా ఉంది. లాక్ డౌన్  ముగిసినప్పటి నుంచి ప్రభుత్వం  పట్టించుకోకపోవడం, జనం విపరీతంగా బయట తిరుగుతుండటంతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కేసులు పెరగడం మొదలైంది.

జాబితాలోపేర్కొన్న 16 జిల్లాల్లో మేడ్చల్ జిల్లాలోనే అతి తక్కువగా టెస్టింగ్ జరుగుతోందని, పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందని కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలో 47,807 శాంపిల్స్ సేకరించగా 13,894 మందికి పాజిటివ్ వచ్చి నట్టుతెలిపింది. రోజువారీ టెస్టుల సంఖ్యను మరింత పెంచి వైరస్ వ్యాప్తిని తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.

కరోనా నియంత్రణ చర్యలు అధ్వానంగా ఉన్న జిల్లాల్లో మన రాష్ట్రంలోని హైదరాబాద్, మేడ్చల్తోపాటు గుజరాత్ లోని అహ్మదాబాద్, సూరత్ కర్ణాటకలోని బెంగళూర్ అర్బన్, కలబుర్గి, బుర్గి ఉడిపి.. తమిళనాడులోని చెనై, కాంచీపురం, రాణిపేట్, థేనీ, తిరువళ్లూరు ,తిరుచిరాప్పలి, ట్యూటికోరిన్, విరుద్ నగర్ జిల్లాలు ఉన్నాయి.