బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని బీహార్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఓకే చెప్తున్నట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది.
కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని చెప్పారు. ఈ సందర్భంగా రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌ను కూడా కోర్టుకు అందించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి బీహార్‌లో కేసు పెట్టగా, దాన్ని ముంబైకి అప్పగించాలని కోరుతూ రియా పిటిషన్ వేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ నేపథ్యంలో దానిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా.. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు రియా బదిలీ చేసుకుందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోరగా, నితీశ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి ప్రతిపాదించారు.

More Stories
సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టుకు తల్లితండ్రులు
నీట్ ప్రశ్నపత్రం లీక్ అనుకోవడం లేదు.. ఎన్టీఏ
ఎబోలా ఉపద్రవంపై భారత్ అప్రమత్తం!