సుశాంత్ మరణానికి కారణం హత్యే 

 బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తాజాగా . ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అతని  మరణానికి కారణం ఆత్మహత్య కాదు హత్య అని ఆమె చెబుతున్న ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై తన వాదనలకు మద్దతుగా ఈ వీడియోలో వివరించారు. 

ముఖ్యంగా సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పటికే వ్యక్తమవుతున్నఅనుమానాలకు తోడు తాజా వీడియో ద్వారా మరింత బలం చేకూరుతోందన్న వాదన వినిపిస్తోంది. 

మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్యకాదు కచ్చితంగా హత్యే అంటూ సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడం గమనార్హం.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

ఇలా ఉండగా, ఈ కేసును దారి మళ్లించడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. 

ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ముంబై వచ్చిన బిహార్ సీనియర్ పోలీసు అధికారి వినయ్ తివారీని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కు తరలించారు.  నిబంధనలు పేరుతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్ చేయడం చర్చకు దారి తీసింది. 

సుశాంత్ కేసు దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఐపీస్ అధికారి వినయ్ తివారీనీ బీఎంసీ అధికారులు ఆదివారం రాత్రి బలవంతంగా క్వారంటైన్ చేశారంటూ  బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీట్ చేశారు. తివారీకి  వసతి కల్పించాలని తాము కోరినా, అతని చేతికి క్వారంటైన్ స్టాంపు వేసి క్వారంటైన్ చేశారని డీజీపీ ఆరోపించారు.