దేశ ప్రజలకు మోదీ రాఖీ శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షాబంధన్ (రాఖీ) పండుగను దేశ ప్రజలు చేసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో ప్రధాని ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరసోదరీమణుల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సోదర, సోదరీమణులను కట్టిపడేసి, బలమైన అనుబందాలను పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. 
 
కరోనా పోరాటంలో నర్సులు చేస్తున్న సేవలు గొప్పవని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రశంసించారు. సోమవారం రాష్ట్రపతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నర్సులు రాష్ట్రపతికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.  
 
కరోనాతో పోరాటంలో అంకితభావంతో పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు ప్రజలు విధిగా సహకరించాలని రాష్ట్రపతి ప్రజలను కోరారు. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 
 
ప్రభుత్వం విధించిన కరోనా  నిబంధనలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి సతీమణి కూడా పాల్గొన్నారు. రాఖీ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో కరోనా నిబంధనలు పాటించారు.
 
అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఈ పండుగ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.