కాంగ్రెస్ నేతలకు కర్ణాటక ప్రభుత్వం నోటీసు 

కాంగ్రెస్ నేతలకు కర్ణాటక ప్రభుత్వం నోటీసు 

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు  డీకే శివకుమార్‌‌ లకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం  లీగల్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమైందంటూ ఈ  నేతలు చేసిన వ్యాఖ్యలు తమ ప్రభుత్వ ప్రతిష్టను ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది.

కరొనకు సంబంధించిన పరికరాల  కొనుగోలులో రూ.2 వేల కోట్ల పైచిలుకు కుంభకోణంకు పాల్పడ్డారని బీజేపీ ప్రభుత్వం‌‌పై సిద్ధరామయ్య, డీకే దుయ్యబట్టారు. ఈ విషయంలో విచారణ జరగాలని వారు డిమాండ్ చేశారు. కర్నాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.

సిద్ధరామయ్యతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న డీకే శివకూమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  రూ.4,167 కోట్లను మహమ్మరి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వెచ్చించిదని పేర్కొన్నారు. ఇందులో రూ 2,000  కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. వెంటిలేటర్లు, పీపీఈ కిట్‌లు, శానిటైజర్లు, గ్లోవ్స్‌ కొనుగోలులో అవినీతి చేశారని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలను బీఎస్ యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం  తిప్పి కొట్టింది. ఆరోపణలు అవాస్తవమని, ఆధారం లేనివని ఘాటుగా స్పందించింది. తాజాగా దీనిపై ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా యత్నించారంటూ సివిల్ క్రిమినల్ ఆఫ్​ డిఫమేషన్ ద్వారా నోటీసులు జారీ చేసింది.