
హ్యాండ్ శానిటైజర్లు అమ్మడానికి లేదా నిల్వ ఉంచేందుకు అవసరమైన లైసెన్సు నుంచి కేంద్ర పభుత్వం మినహాయింపు ఇచ్చింది. డ్రగ్ అండ కాస్మెటిక్ యాక్ట్ కింద స్టాకింగ్ లేదా సేల్సు కు అవసరమైన లైసెన్ అవసరం నుండి నుంచి హ్యాండ్ శానిటైజర్లకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు ఈ శానిటైజర్ల ను మరింత అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే గడువు తీరిపోయిన వాటిని మాత్రం నిల్వ ఉంచేందుకు లేదా సేల్ చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన గెజెట నోటిఫికేషన వెంటనే అమలులోకి రానుంది.
కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ (ఏఐఓసీడీ) వ్యతిరేకిస్తోంది. ఫార్మశీలో కాకుండా మరెక్కడా హ్యాండ్ శానిటైజర్లు అమ్మకుండా చూడాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ శానిటైజరల్లో క్లోరో హెక్సిడైన్, హైడ్రో జన్ పెరాక్సైడ్, ఐస్రో ప్రొఫైల్, ఆల్కహాల్, గ్లిసరాల్, ఇథనాల్, ప్రొపైలిన్ గ్లైకాల్ వంటి డ్రగ్స్ ఉంటాయని పేర్కొంది. వీటిని లైసెన్సు పరిధిలోనే అమ్మాలని చెప్పింది.
ఫార్మశీలో అమ్మే శానిటైజర్లను ప్రభుత్వం తప్పనిసరిగా చెక్ చేసి నియంత్రిస్తుంది. కరోనా బాగా పెరుగుతుండటంతో హ్యాండ్ శానిటైజర్లకు అవసరమయ్యే నియంత్రణలను ప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. ఆల్కహాల్ హ్యాండ్ శానిటైజర్లు తయారు చేయలని లిక్కర్స్ మాన్యు ఫ్యాక్చరర్స్ కు ప్రభుత్వం ఇంతకుముందే ఆదేశించింది.
More Stories
ఐదేండ్లలో రూ. 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య ట్రస్ట్
భారత్, న్యూజిలాండ్ ఎఫ్‌టిఎ చర్చలు పునఃప్రారంభం
దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ కుంభకోణాలు