భారత్ ముస్లింలే కరోనా క్యారియర్లు   

భారత్ ముస్లింలే కరోనా క్యారియర్లు   
భారత్ ముస్లింలే కరోనా క్యారియర్లు కావాలని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) పిలుపిచ్చింది. తన ఆన్‌లైన్ పబ్లికేషన్ ‘వాయిస్ ఆఫ్ హింద్’లో భారత వ్యతిరేక ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది.
 
భారత్‌పై దాడికి కరోనా మహమ్మారిని ఉపయోగించుకోవాలని, కరోనా వాహకాలు (క్యారియర్లు)గా మారి ఆ దేశంపై దాడిచేయాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చింది.భారత్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో 17 పేజీల ‘లాక్‌డౌన్ స్పెషల్’ ఎడిషన్‌ను విడుదల చేసింది. నాస్తికులను చంపేయమంటూ ఇది ప్రోత్సహిస్తోంది. 

ఈ మ్యాగజైన్ కవర్‌పేజీపై ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి హాజరైన వారి ఫొటోతోపాటు ఢిల్లీ అలర్ల ఫొటోలను ముద్రించారు. విశ్వాసులు గొప్పగా నిలబడతారని, అవిశ్వాసులు పడిపోతారని రాసుకొచ్చింది. అలాగే, అవిశ్వాసులను నిర్మూలించే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని అనుచరులను సిద్ధం చేసింది. 

‘‘ఎల్లప్పుడూ ఆయుధాలు కలిగి ఉండండి. అవిశ్వాసులను చంపే అవకాశం వదులుకోవద్దు. వారిని కొట్టి చంపేందుకు చైన్లు, తాళ్లు, వైర్లు సిద్ధంగా ఉంచుకోండి’’ అని అందులో పేర్కొంది. అంతేకాదు, గాజు లాంటి పదునైన వస్తువులైతే సులభంగా చంపొచ్చని కూడా పేర్కొంది. కత్తెర్లు, సుత్తులు కూడా బాగానే ఉపయోగపడతాయని వివరించింది. 

ఐసిస్ తన ‘లాక్‌డౌన్ ఎడిషన్’లో మౌలానా సాద్, జమాత్‌లను కూడా ప్రశంసించింది. కరోనా సూపర్ స్ప్రైడర్లుగా మారారని ప్రశంసించింది. అలాగే, ఢిల్లీ అల్లర్లకు సంబంధించి జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులను అరెస్ట్ చేయడంపైనా తీవ్రంగా స్పందించింది. 

ఈ అరెస్టులకు ప్రతీకారం తీర్చుకోవాలని ముస్లింలను కోరింది. ముస్లింలు కరోనా వైరస్ వాహకాలుగా మారి పోలీసులకు అంటించాలని, అవిశ్వాలను ఎదుర్కొనేందుకు కరోనాను ఆయుధంగా ఉపయోగించుకోవాలని సూచించింది.  

కాగా జనవరిలో చాలా మంది ఉగ్రవాదులు కేరళలో ఉన్నారని నిఘా వర్గాలు చెప్పారు. ఇప్పుడు ఈ మ్యాగజైన్‌లో ఈ విషయాలు ఉండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఇది ఆన్‌లైన్‌లో చాలా మందికి చేరేలా చేశారని కూడా ఒక జాతీయ మీడియా సంస్థ పేర్కొనడం గమనార్హం.