‘ప్రత్యక్ష పన్ను’ మరింత సరళతరం

ప్రత్యక్ష పన్ను చట్టాన్ని మరింత సరళతరం చేయాలనేది ప్రభుత్వ ప్రయత్నమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించాయిరు. పన్ను చెల్లింపుదారులకు కొత్త సాధారణ పన్ను పాలన ఎంపికను ఇవ్వడం వంటి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు కూడా చేపట్టామని ప్రకటించారు. 
 
160వ ఆదాయ పన్ను దినోత్సవం సందర్భంగా ఆమె సందేశమిస్తూ పన్ను చెల్లింపుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్-19 మహమ్మారి సమయంలో తీసుకున్న చర్యలను ప్రశంసించారు. వివిధ రకాల నిబంధనలకు అనుమతి అవసరాలను సడలించి, నగదు సమస్యలను కూడా తొలగించిందని ఆమె  చేశారు. 
పన్ను చెల్లింపుదారులకు ఐటి విభాగం పన్ను పరిపాలనను స్నేహపూర్వకంగా, పారదర్శకంగా చేసిందని, ఇది స్వచ్ఛందంగా సమ్మతించేలా చర్యలు కూడా చేపట్టిందని ఆమె తెలిపారు. ఇటీవల కాలంలో ఐటి విభాగం పాత్ర చాలా మారిపోయిందని, ఇది కేవలం ఆదాయ సేకరణ సంస్థగా కాకుండా పౌర కేంద్రీకృత స్థాపనగా మారిందని సీతారామన్ పేర్కొన్నారు.
‘ప్రత్యక్ష పన్ను చట్టాన్ని మరింత సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షం, పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ప్రత్యామ్నాయ సాధారణ పన్ను వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా పెద్ద పన్ను సంస్కరణలను చేపట్టాం.

కొత్త సాధారణ వ్యవస్థను ఎంచుకునే అవకాశం ఉంది’ అని సీతారామన్ వివరించారు. 

మినహాయింపులను రద్దు చేయడం ద్వారా కంపెనీ పన్ను రేట్లను తగ్గించిందని ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే తయారీని ప్రారంభించడానికి కంపెనీలను ప్రోత్సహించామని, ఇది స్వావలంబన భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. నిజాయితీ పన్ను చెల్లింపుదారులకు సులభతరం కావడానికి, రెవెన్యూ దొంగతనాలను అరికట్టడానికి ఐటి విభాగం అధునాతన టెక్నాలజీ చర్యలు తీసుకుందని ఆమె చెప్పారు. 

 ‌