శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా  

శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా  

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి ఈయనే కావడం గమనార్హం. 

‘‘కరోనా లక్షణాలని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నా. ఆ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కోవిడ్ పరీక్షలు చేసుకోండి. ఇదే నా విన్నపం. వారందరూ హోం  క్వారంటైన్‌లోకి వెళ్లిపోండి’’ అని ట్విట్టర్ వేదికగా శివరాజ్ విజ్ఞప్తి చేశారు. 

గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు.

సీఎంకు పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో సమీపంగా మెలిగిన వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.  కోవిడ్ -19 సమీక్షా సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని శివరాజ్ ప్రకటించారు.